: పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన మంత్రి నారాయణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారాయణ తన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ రక్తదానం చేశారు. ఆయనతో పాటు టీడీపీ కార్యకర్తలు కూడా శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పుట్టినరోజు వేడుకలను ఆయన ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ కు నారాయణ నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు తనకు అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తానని అన్నారు.