: పుట్ బాల్ అభిమానుల కోసం కోల్ కతా హోటళ్ల స్పెషల్ ఆఫర్లు


ఫుట్ బాల్ అభిమానుల కోసం కోల్ కతాలోని హోటళ్లు ప్రత్యేక ఆఫర్లను ఇస్తున్నాయి. ఫుట్ బాల్ ఆట అంటే కోల్ కతా వాసులు చెవి కోసుకుంటారన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రపంచ కప్ ఫుట్ బాట్ మ్యాచ్ లు సందడిగా సాగుతుండటంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అయితే ఈ ఫుట్ బాల్ మ్యాచులేమో... అర్ధరాత్రి దాటాక రెండు, మూడు గంటల వరకు జరుగుతున్నాయి. మరి, ఆ టైమ్ లో మ్యాచ్ చూస్తూ కూర్చునే వారి నోటికీ కాస్త కాలక్షేపం కావాలి కదా. అందుకు తగ్గట్టు తెల్లవారుజామున మూడింటి వరకు హోటళ్లను తెరిచి ఉంచుతున్నారు. కోల్ కతా హోటళ్లు అభిమానుల కోసం నోరూరించే వంటకాలను సిద్ధం చేయడమే కాదు, అవసరమైన వారికి డోర్ డెలివరీ కూడా చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News