: తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర లేదని సోనియాగాంధీనే చెప్పారు: ఎల్.రమణ


అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరించారని... ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర ఏమీ లేదని... ఈ విషయాన్ని స్వయానా సోనియాగాంధీనే చెప్పారని... తన పాత్ర లేనందునే సంపూర్ణ తెలంగాణ రాలేదని గతంలో కేసీఆర్ కూడా చెప్పారని గుర్తు చేశారు. సంపూర్ణ తెలంగాణ సాధిస్తామని అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేయలేదని నిలదీశారు. గతంలో మద్యం అమ్మకాలపై ఉద్యమాలు చేసిన టీఆర్ఎస్ నేతలు... ఇప్పుడు మద్యాన్నే బంగారు బాతుగుడ్డులా భావిస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ మాదిరిగా తెలంగాణలో కూడా బెల్టు షాపులను వెంటనే నిర్మూలించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News