: రూ.56 కోట్లతో పైప్ లైన్ పనులకు శ్రీకారం చుట్టిన కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు


విజయనగరంలోని వైఎస్ఆర్ నగర్ లో ఏపీఎండీపీ పథకం కింద చేపడుతున్న పైప్ లైన్ పనులకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ఇవాళ శంకుస్థాపన చేశారు. రూ.56 కోట్ల నిధులతో ఈ పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ... నాణ్యమైన రీతిలో పనులను చేపడితే ప్రజాధనం వృథా కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గీత, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, కమిషనర్ సోమన్నారాయణ, మాజీ ఛైర్ పర్సన్ కనకమహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News