: ఎన్నారైల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు: మంత్రి పల్లె
తెలుగు భాషకు దివంగత ఎన్టీఆర్ ప్రపంచ స్థాయిలో గౌరవాన్ని తీసుకొచ్చారని... ఆ స్పూర్తిని తాము కూడా కొనసాగిస్తామని ఏపీ సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఈరోజు ఆయన మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ, ఎన్నారైల పరిష్కారానికి ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ సమాచారశాఖ ద్వారా ప్రజల్లోకి తీసుకెళతామని తెలిపారు.