: ఉత్తరప్రదేశ్, బదాయీలో ఆగని అత్యాచారాలు!


అరాచకాల ఉత్తరప్రదేశ్ లోని బదాయి జిల్లాలో ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అత్యాచారాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. తాజాగా మరో అత్యాచార ఉదంతం వెలుగులోకి వచ్చింది. బిసౌలీ ప్రాంతంలో 32 ఏళ్ల ఓ మహిళను నిర్బంధించి ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని, వారిలో ఒకరు పోలీసు ఉద్యోగి కుమారుడని స్థానిక పోలీసులు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం ఆ మహిళ మందులు కొనడానికి ఇద్దరు కుమారులతో కలసి బయటికి వచ్చింది. ఆ సమయంలో హిమాంశు అనే వ్యక్తి ఆమెను పిల్లలతో సహా నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో నిర్బంధించాడు. తర్వాత మరో ఇద్దరితో కలిసి వచ్చి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆమెను శనివారం నాడు విడిచిపెట్టడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల్లో ఒకరైన హిమాంశు పోలీసు అధికారి కుమారుడని తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News