: వడదెబ్బ మృతుల కుటుంబాలకు లక్షన్నర ఎక్స్ గ్రేషియా ప్రకటించిన చంద్రబాబు
మండుతున్న ఎండలకు తాళలేక, వడదెబ్బ బారిన పడి మృతి చెందిన వారి కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబాబు లక్షన్నర రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. సీఎం సహాయనిధి నుంచి రూ. లక్ష, ఆపద్బంధు పథకం నుంచి రూ. 50 వేలు అందజేస్తారు. చంద్రబాబు ఆదేశాల మేరకు రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి సదరు దస్త్రంపై సంతకం చేసి ఆర్థికశాఖ ఆమోదానికి పంపారు.