: హోం మంత్రి నాయిని సమక్షంలో కేఏ పాల్ వాగ్వాదం


హిమాచల్ ప్రదేశ్ లోని పండో రిజర్వాయర్ వద్ద క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ హల్ చల్ చేశారు. ఈ రోజు ఘటనా స్థలానికి చేరుకున్న ఆయన... అక్కడున్న విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని ఆరోపించారు. కాలేజీ యాజమాన్యానికి డబ్బు మీద ఉన్నంత ధ్యాస... మిగిలిన వాటిపై లేదని విమర్శించారు. దీనికి ప్రతిస్పందనగా, డబ్బులకు కక్కుర్తి పడాల్సిన అవసరం తమకు లేదని కాలేజీ సెక్రటరీ డీవీ రావు అన్నారు. ఇదే సమయంలో కాలేజ్ యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మండిపడ్డారు. ఇదంతా తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సమక్షంలోనే జరిగింది.

  • Loading...

More Telugu News