: ప్రత్యేక హోదాకు బీజేపీ కట్టుబడి ఉంది: వెంకయ్యనాయుడు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉండదనే వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈ అపోహలకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెరదించే ప్రయత్నం చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే నిర్ణయాన్ని గత కేంద్ర ప్రభుత్వం తీసుకుందని... దానికి బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కల్పించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని తెలిపారు. పోలవరం విషయంలో కూడా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కుండ బద్దలు కొట్టారు. గ్రామీణాభివృద్ధికి కేంద్రం పెద్ద పీట వేయనుందని చెప్పారు. ఈ రోజు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News