: నల్గొండ కలెక్టరేట్ పై ట్రాన్స్ కో కన్నెర్ర... కరెంట్ బంద్
నల్గొండ జిల్లా కలెక్టరేట్ పై ట్రాన్స్ కో కన్నెర్రజేసింది. కోటి రూపాయలకు పైగా పేరుకుపోయిన విద్యుత్ బకాయిలను చెల్లించకపోవడంతో రెండు రోజులుగా విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. దీంతో కలెక్టరేట్ లో అంధకారం నెలకొంది. కంప్యూటర్లు పనిచేయక ఎక్కడి పని అక్కడే ఆగిపోయింది. పదేపదే నోటీసులు ఇచ్చినప్పటికీ కలెక్టరేట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని... అందుకే ఈ పని చేయాల్సి వచ్చిందని ట్రాన్స్ కో అధికారులు తెలిపారు.