: తెలంగాణ శకుంతలకు ప్రముఖుల నివాళి
ప్రముఖ సినీ నటి తెలంగాణ శకుంతలకు పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. హైదరాబాదు ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచిన ఆమె భౌతికకాయానికి నివాళులర్పించిన వారిలో ప్రముఖ సినీ నిర్మాత రామానాయుడు, దర్శకుడు తేజ, నటీనటులు హేమ, ఝాన్సీ, వేణుమాధవ్ తదితరులు ఉన్నారు.