: మూడు కిలో మీటర్లు వెతికినా ఫలితం లేదు: మర్రి శశిధర్ రెడ్డి


బియాస్ నదిలో లార్జీ డ్యాం నుంచి మూడు కిలోమీటర్ల దూరం వెదికినా ఫలితం లేకపోయిందని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధరరెడ్డి తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ లో ఆయన మాట్లాడుతూ, అండర్ వాటర్ కెమెరాలతో వెతికినా విద్యార్థుల మృతదేహాలు దొరకలేదని చెప్పారు. సుమారు 700 మంది సిబ్బంది విద్యార్థుల మృతదేహాల కోసం జల్లెడ పట్టారని ఆయన వెల్లడించారు. రాడార్, లీనార్ పరికరాలతో రేపట్నుంచి వెతుకుతామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News