: పోలవరం ముంపు మండలాలను ఆంధ్రలో కలపడానికి కేసీఆరే కారణం: భట్టి విక్రమార్క
పోలవరం ముంపు మండలాలు ఆంధ్రలో కలవడానికి కారణం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే అని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈరోజు శాసనసభలో మల్లు మాట్లాడుతూ, 1956 నాటి తెలంగాణ కావాలని కేసీఆర్ పదేపదే కోరారని... అందుకే కేంద్ర ప్రభుత్వం పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలుపుతోందని అన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలోను, ప్రధానికి కేసీఆర్ ఇచ్చిన వినతి పత్రంలోను పోలవరం ప్రస్తావనే లేదని... అందుకే ఆర్డినెన్స్ విషయంలో కేసీఆర్ వ్యవహారశైలిపై తమకు సందేహాలు ఉన్నాయని తెలిపారు.