: ఏపీ శాసనసభ ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ
ఈ నెల 19 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ శాసనసభ ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లను డీజీపీ రాముడు, ఇంటెలిజెన్స్ చీఫ్ అనురాధ పరిశీలించారు. అటు పాత అసెంబ్లీ హాలులోనూ ఏర్పాట్లను పరిశీలించారు.