: తెలంగాణ అమరవీరులకు మండలిలో నివాళులు
తెలంగాణ అమరవీరులకు, హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనలో మరణించిన వారికి నివాళులర్పిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనమండలిలో తీర్మానం చేశారు. అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రమని కేసీఆర్ అన్నారు. వారిని తలచుకోవడం సభ్యులుగా తమ విధి అని ఆయన చెప్పారు. తెలంగాణ అమరవీరులకు, హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనలో మృతులకు సంతాప సూచకంగా మండలిలో రెండు నిమిషాలు మౌనం పాటించారు.