: ఐటీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తా: పల్లె రఘునాథరెడ్డి
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగ అభివృద్ధి కోసం తాను నిరంతరం శ్రమిస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. సచివాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్ ను సందర్శించిన ఆయన మార్పు చేర్పులను సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి పాలన అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు సోమవారం నుంచి విధుల్లోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే 11 మంది మంత్రులకు సచివాలయంలో ఛాంబర్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఆయా మంత్రుల అభీష్టానికి అనుగుణంగా ఛాంబర్లను తీర్చిదిద్దుతున్నారు.