: రెండు దశాబ్దాల తరువాత మాజీ సీఎం సాయం కోరిన మరో మాజీ సీఎం
రెండు దశాబ్దాల తరువాత బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరో మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సహాయం కోరారు. 1994లో లాలూ నుంచి విడిపోయిన తరువాత లాలూ సాయం కోరానని నితీష్ చెప్పడం ఇదే తొలిసారి. పాట్నాలో నితీష్ కుమార్ మాట్లాడుతూ, బీహార్ అసెంబ్లీలో బల ప్రదర్శన సందర్భంగా జతిన్ రామ్ మాంఝీ ప్రభుత్వానికి మద్దతివ్వాలని ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐ పార్టీలను కోరానని అన్నారు. బీజేపీని ఓడించేందుకు తమతో కలిసి రావాలని లాలూను కోరానని నితీష్ తెలిపారు.