: గందరగోళంలో ఉన్నాం...స్పష్టత ఇవ్వండి... మోడీకి లేఖ రాసిన వైఎస్సార్సీపీ
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి వైఎస్సార్సీపీ లేఖ రాసింది. గత ప్రధాని చేసిన ప్రకటనకు కట్టుబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పించాలని లేఖలో వైఎస్సార్సీపీ కోరింది. ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు ప్రతిపక్ష నేత హోదాలో అరుణ్ జైట్లీ కూడా హామీ ఇచ్చారని లేఖలో పేర్కొన్నారు. ప్రణాళిక సంఘం నివేదిక, వ్యాఖ్యల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఆందోళన, గందరగోళం నెలకొన్నాయని, వాటిని తొలగిస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భవిష్యత్ పై భరోసా కల్పిస్తూ ప్రధాని స్పష్టమైన ప్రకటన చేయాలని లేఖలో వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది.