: ఆగండాగండి...బాబు మోసాలు వెలుగులోకి వస్తాయి: జగన్


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి మోసాలు తొందర్లోనే వెలుగులోకి వస్తాయని వైఎస్సార్సీపీ అధినేత జగన్ తెలిపారు. విజయవాడలో ఎన్నికల సమీక్ష జరిపిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అబద్దాలు చెప్పి అధికారంలోకి రావాలని అనుకోలేదని అన్నారు. పదవీ వ్యామోహంతో అబద్దాలు చెబితే తరువాత ప్రజల్లోకి వెళ్లలేమని ఆయన అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ లా మరణించినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలవాలంటే, మనం మోసం చేశామని ప్రజలు భావించకూడదని ఆయన అన్నారు.

కొద్ది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుందని, రైతులు బ్యాంకులకు రుణాల కోసం వెళ్తారని, అప్పుడు బాబు అసలు నైజం బయటపడుతుందని జగన్ అన్నారు. అప్పట్లోగా రైతు రుణాలు మాఫీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును జగన్ డిమాండ్ చేశారు. రుణమాఫీపై కమిటీ ఏర్పాటు చేశామని చెప్పి కాలయాపన చేయడం తగదని ఆయన హితవు పలికారు. విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయాలని భావించానని జగన్ తెలిపారు.

  • Loading...

More Telugu News