: తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు వడగాలులు
తెలంగాణ రాష్ట్రంలో వడగాలుల తీవ్రత కొనసాగుతోందని హైదరాబాదులోని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో మెదక్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో రెండు రోజుల పాటు వడగాలులు వీస్తాయని పేర్కొంది. దీని దృష్ట్యా ప్రజలు అప్తమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీలో అక్కడక్కడా వానలు కురిసే అవకాశముందట.