: కేసు నమోదు చేశాం...ప్రీతి జింటాకు అన్యాయం జరగదు: ముంబై పోలీసులు


మాజీ ప్రియుడు నెస్ వాడియాపై సినీ నటి, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు సహయజమాని ప్రీతి జింటా ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించామని ముంబై పోలీసులు తెలిపారు. నెస్ వాడియాను అరెస్టు చేయాలని మహిళా సంఘాలు పెద్దఎత్తున ఆందోళన చేస్తుండడంతో ముంబై పోలీసులు స్పందించారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతుందని, ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా జరిగిన సంఘటనపై మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నామని అన్నారు. ప్రీతిజింటాకి అన్యాయం జరగదని వారు అభిప్రాయపడ్డారు. కాగా, నెస్ వాడియా మాట్లాడుతూ, ప్రీతి జింటా ఆరోపణలు అవాస్తవమని అన్నారు.

  • Loading...

More Telugu News