: కళ్లెదుట కాలిపోయిన ఇల్లు... బాధతో ప్రాణాలు విడిచిన పెద్దాయన
శుక్రవారం అర్థరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. అయితే, కళ్ల ముందే ఆస్తి బుగ్గిపాలు కావడంతో బాధ తట్టుకోలేక ఆ కుటుంబ పెద్ద ప్రాణాలు విడిచాడు. విజయనగరం జిల్లా ఎస్. కోట రూరల్ మండలంలోని తిమ్మిడి గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో రూ.5 లక్షల ఆస్తినష్టం జరిగిందని మండల రెవెన్యూ అధికారి అంచనా వేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
ట్రంకు పెట్టెలో ఉంచిన 5 తులాల బంగారంతో పాటు 2.50 లక్షల రూపాయల నగదు పూర్తిగా కాలిపోయిందనే బాధతో ఆ ఇంటి పెద్ద ఎర్రన్నాయుడు (50) గుండెపోటుతో మరణించాడు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే లలితకుమారి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.