: దేశంలో ఎక్కడ సెటిలైనా అదే నెంబర్
ఇప్పటి వరకు ఒక టెలికాం సర్కిల్ పరిధిలో ఒక ఆపరేటర్ నుంచి మరో ఆపరేటర్ కు అదే నెంబర్ ను మార్చుకోవడం సాధ్యం అవుతుండగా, త్వరలోనే ఇది దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఏ సర్కిల్ కు వెళ్లినా అదే నెంబర్ ను కొనసాగించుకోవడానికి వీలు కల్పించే నెంబర్ పోర్టబిలిటీకి టెలికాం కమిషన్ ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం తమ సర్కిల్ నుంచి ఎవరైనా వేరే సర్కిల్ కు వెళ్లినప్పుడు రోమింగ్ చార్జీలను చెల్లించాల్సి వస్తోంది. ఇకపై వారు వేరే సర్కిల్ లోనూ స్థానికులుగా అదే నెంబర్ తో కొనసాగడానికి తాజా నిర్ణయం వీలు కల్పిస్తుంది. అయితే టెలికాం కమిషన్ నిర్ణయానికి ట్రాయ్ కూడా ఆమోదం తెలిపాల్సి ఉంది.