: అమెరికా నేషనల్ సైన్స్ బోర్డులో భారత శాస్త్రవేత్త?
అమెరికాలో ప్రతిష్ఠాత్మక జాతీయ సైన్స్ బోర్డులో ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త సేతురామన్ పంచనాథన్ ను సభ్యుడిగా నియమించాలని ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా నిర్ణయించారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ వెల్లడించింది. ప్రస్తుతం అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో సేతురామన్ పనిచేస్తున్నారు. మద్రాస్ యూనివర్సిటీలో బీఎస్సీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి బీఈ, ఐఐటీ నుంచి ఎంటెక్, కెనడాలోని ఒట్టావా యూనివర్సిటీ నుంచి పీహెచ్ డీ సేతురామన్ పూర్తి చేశారు.