: హిమాచల్ ప్రదేశ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియో: కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ ఈ రోజు హిమాచల్ ప్రదేశ్ లో మృతి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులకు సంతాపం తెలిపింది. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియో ఇస్తామని ప్రకటించారు. ఘటనపై హిమాచల్ ప్రదేశ్ సీఎంతో మాట్లాడానని, హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి, పార్టీ ఎంపీలు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారని పేర్కొన్నారు.