: గుజరాత్ లో రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం


గుజరాత్ లోని ఆనంద్ నగర్ జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. వీరంతా మధ్యప్రదేశ్ లోని అలిరాజ్ పూర్ జిల్లా జోబట్ ప్రాంతానికి చెందినవారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, నలుగురు చిన్నారులు, జీప్ డ్రైవర్ ఉన్నారు. ఉపాధి కోసం 18 మంది జీప్ లో వెళుతుండగా వీరి జీప్ ను కంటెయినర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మిగిలిన 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆనంద్ లోని ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News