: నన్ను ప్రేమతో 'రావు సాబ్' అని పిలిచేవారు: కేసీఆర్
విద్యార్థి దశనుంచే ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని... తెలంగాణ వచ్చిన సమయంలో ఆయన మన మధ్య లేకపోవడం తీరని లోటని టీ.సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. జయశంకర్ సార్ తనను 'రావు సాబ్' అని ప్రేమతో పిలిచేవారని గుర్తు చేసుకున్నారు. ఈ రోజు శాసనసభలో అమరవీరుల సంతాప తీర్మానాన్ని కేసీఆర్ ప్రవేశపెట్టారు. అనంతరం ప్రసంగిస్తూ, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర కీలకమైనదని చెప్పారు. సంతాప తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది.