: వెంకన్నను దర్శించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
ఈ రోజు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శ్రీవారి సేవలో తరించారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో వీరు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో సినీనటులు నాగార్జున, అమల దంపతులు, శ్రీకాంత్ ఉన్నారు. అలాగే రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్, టీడీపీ ఎమ్మెల్యే నారాయణ స్వామి, ఎంపీ ఎస్పీవై రెడ్డి కూడా స్వామి వారిని దర్శించుకున్నారు.