: ఫుట్ బాల్... శృంగారం... రెంటిలో దేనిది పైచేయి?
ప్రపంచాన్ని ఫుట్ బాల్ ఫీవర్ ఊపేస్తోంది. బ్రెజిల్ లో సాయంత్రాలు పలు దేశాల్లో అర్ధరాత్రి కావడంతో వివాహితులు గొప్ప ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. అర్ధరాత్రి ఫుట్ బాల్ పోటీల ప్రత్యక్ష ప్రసారాలు జరుగుతుండడంతో పలు దేశాల్లో సంసారానికి కామా పెట్టేస్తున్నారని డ్యూరెక్స్ సర్వే తెలిపింది. 'ఫుట్ బాల్ చూడాలి, ఏమనుకోకు' అంటూ 40 శాతం మంది పురుషులు శృంగారానికి దూరంగా ఉంటున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ సర్వే కోసం 2 వేల మంది బ్రిటిష్ పౌరులను డ్యూరెక్స్ సంస్థ ఎంచుకుంది.
సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది 'వెన్నునొప్పిగా ఉంది', 'విపరీతంగా అలసిపోయాను', 'తల నెప్పిగా ఉంది' వంటి కారణాలను చూపి శృంగారం తప్పించుకుంటున్నారని సర్వే వెల్లడించింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అయితే చాలా తొందరగా శృంగారం ముగించేస్తున్నారని సర్వే తెలిపింది. టీవీ అందుబాటులో ఉంచితే శృంగారానికి సై అంటూ కొందరు పురుషులు పందాలు కాస్తున్నారట.
పీఫా ఫుట్ బాల్ కప్ కాదు కానీ తమని సంసారానికి దూరం చేస్తోందని సర్వేలో పలువురు అభిప్రాయపడడం విశేషం. దీంతో శృంగారం కంటే ఫుట్ బాల్ వైపే ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారని సర్వే వెల్లడించింది.