: ఏపీకి 'ప్రత్యేక హోదా' హామీ కాదు... ప్రకటన : యనమల
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలని ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, లోక్ సభ సాక్షిగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తున్నట్టు ప్రకటన చేశారని గుర్తు చేశారు. ప్రధాని హోదాలో ఆయన ఇచ్చినది హామీ కాదని, ప్రకటన అని ఆయన సూచించారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని ప్రణాళికా సంఘం అనడం చట్టవిరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాపై ప్రణాళికా సంఘానికి అభిప్రాయం చెప్పే హక్కు ఉంది తప్ప, ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకునే అధికారం లేదని ఆయన తెలిపారు. ప్రణాళికా సంఘం వ్యాఖ్యలని తీవ్రంగా పరిగణించాలని ఆయన డిమాండ్ చేశారు.