: డాక్టర్ నోరి దత్తాత్రేయుడికి మరో ప్రతిష్ఠాత్మక అవార్డు
ప్రపంచ ప్రఖ్యాత కేన్సర్ నిపుణుడు, ప్రవాసాంధ్రుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. ప్రపంచంలోని అత్యుత్తమ కేన్సర్ ఆస్పత్రుల్లో ఒకటైన 'స్లోన్ కెటరింగ్ కేన్సర్ సెంటర్' ఆయనను 'విశిష్ఠ సేవా పురస్కారం'తో సత్కరించింది. కేన్సర్ నివారణకు ఆయన అందించిన సేవలకు గాను ఆయనకు ఈ గౌరవం దక్కింది. కొద్ది రోజుల కిందటే ఆయనను 'ఎలిస్ ఐలండ్ మెడల్ ఆఫ్ ఆనర్' అవార్డుతో సత్కరించారు. అమెరికాలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అవార్డుల్లో ఇది కూడా ఒకటి.