: జైల్లో యశ్వంత్ సిన్హా తలకు గాయాలు


బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా గాయపడ్డారు. జార్ఖండ్ లోని హజారీ బాగ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న యశ్వంత్ సిన్హా తలకు స్వల్పగాయాలయ్యాయి. గాయాలకు కారణాలు తెలియలేదు. కాగా హజారీబాగ్ లో విద్యుత్ కార్యాలయం వద్ద జార్ఖండ్ విద్యుత్ బోర్డు జనరల్ మేనేజర్ ధానేష్ జాను చేతులు కట్టేసి కొట్టారనే కేసులో యశ్వంత్ సిన్హా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. బెయిల్ తీసుకునేందుకు నిరాకరించడంతో ఆయనతో పాటు మరో 54 మంది అదే జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.

  • Loading...

More Telugu News