: రాజమండ్రిలోనూ స్కూల్ బస్సులపై కొరళా ఝుళిపించిన ఆర్టీఏ అధికారులు
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని స్కూలు, కాలేజ్ బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. ఫిట్ నెస్ లేని పాఠశాల, కళాశాలలకు చెందిన ఆరు బస్సుల్ని అధికారులు సీజ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా మరో వారం రోజుల పాటు తనిఖీలు కొనసాగిస్తామని ఆర్టీఏ అధికారులు చెప్పారు. కండీషన్ సరిగా లేని బస్సులను నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.