: ఆంధ్రా మీడియా అహంకారాన్ని సహించం... చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాం: కేసీఆర్
ఆంధ్రా యాజమాన్యానికి చెందిన మీడియాపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఆంధ్రా మీడియాది అంతులేని అహంకారమని... ఇకపై దాని అహంకారాన్ని సహించబోమని అన్నారు. టీవీ9 ఛానెల్ తెలంగాణ శాసనసభను, ఎమ్మెల్యేలను అవమానించిందని ఆరోపించారు. టీ.ఎమ్మెల్యేలను పాచికల్లు తాగిన మొహాలని టీవీ9 ప్రసారం చేసిందని మండిపడ్డారు. ఈ రోజు శాసనసభలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రజ్యోతి కూడా అడ్డగోలు రాతలు రాస్తోందని... ఏ ధైర్యంతో అలా రాస్తోందని అన్నారు. లేని సమస్యలను ఉన్నట్టు చూపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఆంధ్రా మీడియా ఆటలు సాగనివ్వనని... తమిళనాడు తరహాలో కేబుల్ చట్టాన్ని ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంటుందని తెలిపారు.