: నీటి విడుదల ఆపేసి...విద్యార్థుల కోసం గాలింపు
హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో గల్లంతైన తెలుగు విద్యార్థుల గాలింపు చర్యల కోసం లార్జీ డ్యాం నీటి విడుదలను అధికారులు పూర్తిగా నిలిపేయనున్నట్టు తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. మండిలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల మృతదేహాల గాలింపు కోసం హైదరాబాద్ నుంచి 12 మంది గజ ఈతగాళ్లను రప్పించామన్నారు. ఇప్పటికే సహాయక చర్యల్లో 600 మంది సిబ్బంది పాలుపంచుకుంటున్నారని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు 8 మృతదేహాలు లభ్యమవగా, మరో 16 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని ఆయన తెలిపారు.