: ఆన్ లైన్ పైరసీపై చైనా ప్రచారం మొదలు


అనవసరమైన సమాచారాన్ని ఇస్తూ విస్తృత ప్రచారం కల్పిస్తున్న వెబ్ సైట్లు, సంప్రదాయ మీడియా లక్ష్యంగా ఆన్ లైన్ పైరసీపై చైనాలో ప్రచారం ప్రారంభించారు. ఈ మేరకు ఆ దేశ పరిశ్రమ, సమాచార సాంకేతిక, ప్రజా భద్రత మంత్రిత్వ శాఖ ఈ ప్రచారాన్ని నేటి నుంచి మొదలుపెట్టింది. జూన్ నుంచి నవంబర్ వరకు ఉండే ఈ ప్రచారాన్ని నేషనల్ కాపీరైట్ అడ్మినిస్ట్రేషన్, స్టేట్ ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఆన్ లైన్, సంప్రదాయ మీడియా మధ్య సహకారాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ అడుగువేసినట్టు సదరు విభాగాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News