: కరాచీ విమానాశ్రయంపై తీవ్రవాద దాడులకు మోడీ ఖండన
ఇటీవల వరుసగా పాకిస్థాన్ లోని కరాచీ విమానాశ్రయంపై తీవ్రవాద దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖండించారు. అంతేగాక హింసకు తావులేని వాతావరణంలో ఆ దేశంతో (పాక్) పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ మేరకు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు మోడీ లేఖ రాసినట్లు ఓ ఆంగ్ల చానల్ తెలిపింది. గత ఆదివారం అర్థరాత్రి కరాచీ విమానాశ్రయంపై జరిగిన తీవ్రవాదుల దాడుల్లో 23 మంది మరణించగా, వారిలో పదిమంది మిలిటెంట్లు కూడా ఉన్నారు. కాగా, భారత్ పర్యటనపై తాను పూర్తి సంతృప్తితో ఉన్నానని, రాబోయే రోజుల్లో శాంతియుత వాతావరణంలో పనిచేస్తామని షరీఫ్ కొన్ని రోజుల కిందట మోడీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.