: సబిత.. ఇక తప్పుకుంటే మంచిది!: నారాయణ
జగన్ అక్రమాస్తుల కేసు ఐదో ఛార్జిషీటులో ఏ4 నిందితురాలిగా చేర్చబడిన రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. సీబీఐ నేడు దాఖలు చేసిన తాజా ఛార్జిషీటులో మంత్రి పేరు ఉన్నందున, నైతిక బాధ్యత వహించి పదవి నుంచి తప్పుకోవాలని నారాయణ సూచించారు. ఇక విద్యుత్ సమస్యలపై రేపు తలపెట్టిన బంద్ కు మద్దతుగా.. రేపు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసిన వివిధ యూనివర్శిటీల వీసీలకు నారాయణ కృతజ్ఞతలు తెలిపారు.