: కేంద్రంపై ఒత్తిడి తెస్తాం: కేసీఆర్


కేంద్రంపై అన్ని రకాలుగా ఒత్తిడి తెచ్చేందుకు, తెలంగాణకు నిధులు తెప్పించుకునేందుకు ఢిల్లీకి అఖిలపక్షం పంపుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ శాసనసభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు తగ్గించకుండా ముస్లింలకు, గిరిజనులకు రిజర్వేషన్లు అమలు చేస్తామని అన్నారు. ముస్లిం, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తమిళనాడు తరహా చట్టం తెస్తామని కేసీఆర్ తెలిపారు. దీనిపై బీజేపీ నేత లక్ష్మణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు సరికాదంటూ కేసీఆర్ ప్రసంగానికి అడ్డుతగిలారు. దీంతో రిజర్వేషన్లను చట్టబద్దం చేస్తామని కేసీఆర్ తెలిపారు. అలాగే వక్ఫ్ భూములపై విచారణ జరిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అమరవీరుల కుటుంబాలకు ఏం చేసినా తక్కువేనన్న కేసీఆర్, 1965 ఉద్యమంలో పాల్గొన్న వారిని కూడా ఆదుకుంటామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి దళితుడికీ 3 ఎకరాల సాగు భూమి ఇస్తామని తెలిపారు.

కేంద్రం ఇవ్వకపోయినా రైతులకు సబ్సిడీపై విత్తనాలను సరఫరా చేస్తామని కేసీఆర్ చెప్పారు. ఎరువులకు కొరత రాకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంటుందని కేసీఆర్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News