: జులై రెండో వారం నుంచి బడ్జెట్ సమావేశాలు: వెంకయ్యనాయుడు
బడ్జెట్ సమావేశాలు జులై రెండో వారం నుంచి ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ సమావేశాల్లోనే ఉపసభాపతి ఎన్నిక ఉంటుందని చెప్పారు. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు అధికారిక నివాసాలు ఖాళీ చేయాలన్నారు. రాజ్యసభలో 60 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఈ మేరకు ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయన్న వెంకయ్య, ఏపీకు తగిన ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఇక రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇచ్చాక నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.