: ఢిల్లీలో కూల్ కూల్... ఎంజాయ్ చేసిన నగరవాసులు
దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఇవాళ చల్లని సాయంత్రాన్ని నగరవాసులు ఎంజాయ్ చేశారు. గత వారం రోజులుగా ఢిల్లీలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈరోజు వర్షం కురిసి, వాతావరణం చల్లబడటంతో మండే ఎండల నుంచి ఉపశమనం లభించినట్లయింది.