: పోలవరంపై ఆర్డినెన్స్ జారీ చేయించింది చంద్రబాబు కాదా?: కేసీఆర్
రాత్రికి రాత్రి పోలవరం ప్రాజెక్టుపై ఆర్డినెన్స్ జారీ చేయించింది చంద్రబాబునాయుడు కాదా? అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ శాసనసభలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ అధినేత కారణంగా తెలంగాణలోని గిరిజన గ్రామాలు ముంపుకు గురవుతున్నాయని ఆరోపించారు. పలుకుబడిని ఉపయోగించి చంద్రబాబు ప్రధానితో కలిసి కూర్చొని రాత్రికి రాత్రి పోలవరంపై ఆర్డినెన్స్ జారీ చేసేలా ఒత్తిడి తెచ్చారని మండిపడ్డారు. 'చేసేది చేస్తుంటాం, కానీ మమ్మల్ని అంటే ఊరుకోము' అన్నట్టు టీడీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించారు. సభను ఎలా నడపాలో తమకు తెలుసని కేసీఆర్ వ్యాఖ్యానించారు.