: ఎనిమిది బాల్య వివాహాలను అడ్డుకున్న అధికారులు


తమిళనాడులో ఒకేరోజు జరుగుతున్న ఎనిమిది బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. బుధవారం రాత్రి కృష్ణగిరి జిల్లాలోని చిక్కామంజు గ్రామంలో ఈ బాల్య వివాహాల కోసం ఏర్పాట్లు చేయగా, కలెక్టర్ టి.పి. రాజేష్ చొరవతో వాటిని అడ్డుకున్నారు. అనంతరం పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఆయన కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్ బాలికలను అధికారులు ప్రైవేటు మహిళా సంరక్షణ కేంద్రంలో చేర్పించారు. వీరంతా కురుంబార్ వర్గానికి చెందిన వారు. తమిళనాడులో కురుంబార్ వర్గంలో బాల్యవివాహాలు చేయడం ఆనవాయతీగా వస్తోంది.

  • Loading...

More Telugu News