: ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాలంటీర్లను పాక్ తాలిబన్లు బెదిరిస్తున్నారు: శ్రీశ్రీ రవిశంకర్
పాకిస్థాన్ లో ఉన్న తమ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫ్యాకల్టీ సభ్యులు, వాలంటీర్లను తాలిబన్లు బెదిరిస్తున్నారని సంస్థ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు రెండు నెలల నుంచి వారికి లేఖలు, ఫోన్ల రూపంలో తీవ్ర బెదిరింపులు వస్తున్నాయని వివరించారు. ఈ విషయంపై తమకు పాక్ అధికారులు సమాచారం అందించారని రవిశంకర్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సిబ్బంది, వాలంటీర్లు కుట్ర పన్నుతున్నారని పాకిస్తాన్ తాలిబాన్ ఆరోపణలు చేస్తోంది.