: చాదర్ ఘాట్ స్కూల్ ఖాళీ చేసిన భద్రతా సిబ్బంది


హైదరాబాదులోని చాదర్ ఘాట్ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాన్ని భద్రతా సిబ్బంది ఖాళీ చేశారు. అక్కడికి సమీపంలో ఉన్న ప్రైవేటు ఫంక్షన్ హాలులోనికి వారు మకాం మార్చుకున్నారు. వేసవి సెలవులు కావడంతో గత రెండు నెలలుగా సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ సిబ్బంది చాదర్ ఘాట్ స్కూలులో బస చేస్తున్నారు. దీంతో, రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ పాఠశాలలు పునఃప్రారంభమైనా చాదర్ ఘాట్ స్కూల్ ఈరోజు ప్రారంభం కాలేదు. మీడియాలో ఈ విషయంపై వార్తలు రావడంతో పోలీస్ శాఖ స్పందించి... సిబ్బంది బసను వెంటనే మార్పించింది.

  • Loading...

More Telugu News