ఇరాక్ దేశంలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. వరుస బాంబు దాడులతో మారణహోమం సాగిస్తున్నారు. కీలక పట్టణాల్ని టెర్రరిస్టులు స్వాధీనం చేసుకుంటున్నారు. దీంతో ఇరాక్ ప్రభుత్వం అమెరికా సాయం కోరింది.