: నర్మదా డ్యామ్ ఎత్తు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్... రెండు లక్షల మందిపై ప్రభావం
అహ్మదాబాద్ లోని నర్మదా నదిపై నిర్మించిన సర్ధార్ సరోవర్ డ్యామ్ ఎత్తును 17 మీటర్ల వరకు పెంచేందుకు డ్యామ్ అధికారులు అనుమతిచ్చారు. ఈ పెంపు వల్ల అక్కడి ప్రాంతాల్లో నివసిస్తున్న రెండు లక్షల 50వేల మందిపై ప్రభావం పడుతుందని ఎన్ బీఏ (నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ) చెబుతోంది. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత, గతంలో నర్మదా బచావో ఆందోళనలో పాల్గొన్న మేథా పాట్కర్ మాట్లాడుతూ, ఈ నిర్ణయం అన్యాయం, అప్రజాస్వామికమని వ్యాఖ్యానించారు. డ్యామ్ కు చుట్టు పక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. సంబంధిత శాఖ ఇక్కడి పరిస్థితిని అంచనా వేసి ఏ నిర్ణయమైనా తీసుకోవాలని కోరారు.