: 'ఫిఫా' వరల్డ్ కప్ కు ఆరుగురు గోవా ఎమ్మెల్యేలు
బ్రెజిల్లో నేటి నుంచి ప్రారంభమవుతున్న 'ఫిఫా' వరల్డ్ కప్ కు గోవా ప్రభుత్వం ఆరుగురు ఎమ్మెల్యేలను పంపింది. ఈ పర్యటన కోసం ప్రభుత్వం నిధులను కూడా విడుదల చేసింది. వెళ్లిన వారిలో గోవా క్రీడాశాఖ మంత్రి రమేశ్ త్వాడ్కర్ కూడా ఉన్నారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. అయితే, వెళ్లిన ప్రతినిధి బృందంలో గోవా స్పోర్ట్స్ అథారిటీ నుంచి ఏ ఒక్క నిపుణుడు గానీ, సభ్యుడు గానీ లేనట్లు సమాచారం. కాగా, ఈ పర్యటన కోసం గోవా ప్రభుత్వం రూ.89 లక్షలు ఖర్చు పెడుతోందంటూ కాంగ్రెస్ ఆరోపించడంపై ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ స్పందించేందుకు నిరాకరించారు.