: ఎపీ కేబినెట్ భేటీలో సుదీర్ఘ చర్చలు
ఏపీ కేబినెట్ తొలి భేటీ ఏయూలోని టీఎల్ఎన్ సభాహాలులో కొనసాగుతోంది. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకంపై సమావేశంలో సమగ్రంగా చర్చిస్తున్నారు. వితంతు, వికలాంగ, వృద్ధాప్య పింఛన్ల పెంపుపై సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. రైతులకు ఆంక్షల్లేని రుణమాఫీ, చేనేత, డ్వాక్రా సంఘాల రుణాల మాఫీ సాధ్యాసాధ్యాలపై సమీక్షిస్తున్నారు. మద్యం గొలుసు దుకాణాల నిషేధంపై చర్చిస్తున్నారు. దీనికితోడు, ఉద్యోగుల వయోపరిమితిని 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచడంపై సమావేశంలో చర్చలు జరుపుతున్నారు.