: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో ఎంపీ కవిత భేటీ
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో టీఆర్ఎస్ ఎంపీ కవిత భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్ లో పసుపు నిల్వ, విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని ఆమె కోరారు. తెలంగాణ రాష్ట్రానికి నిధులు, కేటాయింపులతో బాటు, మరిన్ని విషయాలపై వారు చర్చించినట్టు, కవిత ప్రస్తావించిన అంశాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.